HomeTelugu Trendingదిశ ఎక్కడ? ఆమెకు ఏం జరిగింది? .. వలయం ట్రైలర్‌

దిశ ఎక్కడ? ఆమెకు ఏం జరిగింది? .. వలయం ట్రైలర్‌

8 8
హిప్పీ బ్యూటీ ‘దిగంగన’ హీరోయిన్‌గా నిర్మితమవుతున్న రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వలయం’. రమేశ్‌ కడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్నాడు. చదలవాడ పద్మావతి నిర్మిస్తు​న్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ‘నిన్ను చూశాకే’ అంటూ వచ్చిన రొమాంటిక్‌ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఈ సాంగ్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

తాజాగా ‘వలయం’ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 103 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌ తొలుత హీరో హీరోయిన్లు ఒకరినొకరు పరిచయం చేసు​కోవడంతో ప్రారంభమవుతుంది. తర్వాత కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ వెంటనే యాక్షన్‌ అండ్‌ సస్పెన్స్‌ అంశాలను ట్రైలర్‌లో జోడించారు. దీంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu