HomeTelugu Trendingవిరాటపర్వం నుండి 'కోలు కోలు' సాంగ్‌ ప్రోమో

విరాటపర్వం నుండి ‘కోలు కోలు’ సాంగ్‌ ప్రోమో

Kolu Kolu Song Promo fromసాయి పల్లవి, దగ్గుబాటి రానా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘కోలు కోలు’ ప్రోమోని విడుదల చేసింది. ‘కోలు కోలు’ పాటకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. లిరిసిస్ట్ చంద్రబోస్ వినసొంపైన సాహిత్యం అందించారు. దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి కలసి ఆలపించారు. ఇక ఈ సాంగ్ లో లంగావోణీ ధరించి ఉన్న సాయి పల్లవి లుక్‌ ఆకట్టుకుంటుంది. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu