HomeTelugu Trendingఇంతకీ.. ఆచార్యలో మహేష్‌ ఉన్నట్టా లేనట్టా.?

ఇంతకీ.. ఆచార్యలో మహేష్‌ ఉన్నట్టా లేనట్టా.?

1 16
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం మహేష్ నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గతంలో చిరు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి మహేష్ తో చర్చించలేదని రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశం ఉందని చిరంజీవి తెలిపారు. దాంతో మహేష్ ఆచార్యలో నటిస్తున్నారన్న వార్త కు చెక్‌ పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ ‘ఆచార్య’ లో చరణ్‌ను ఓ పాత్ర కు అనుకున్నామని అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా కారణంగా చరణ్ ‘ఆచార్య’లో నటించడం వీలు కాదేమో అని టెన్షన్ పడ్డారట. ఆ సమయంలో కొరటాల సమస్యను మహేష్ అర్థం చేసుకుని “నేనున్నాను.. భయపడకండి”అంటూ ధైర్యం చెప్పారట. ఈ ప్రకారం చూసుకుంటే చరణ్ నటించని పక్షంలో మహేష్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే చూడాలి చివరికి ఏమౌతుందో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu