HomeTelugu Trendingరంగ రంగ వైభవంగా: కొత్తగా లేదేంటి సాంగ్‌ విడుదల

రంగ రంగ వైభవంగా: కొత్తగా లేదేంటి సాంగ్‌ విడుదల

Kothaga Ledhenti Video song
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ – రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. తమిళ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. RRV నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. తాజాగా ‘కొత్తగా లేదేంటి’ వీడియో సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు.

వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ లపై షూట్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్.. ఇద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని ఆవిష్కరిస్తోంది. దేవిశ్రీప్రసాద్.. ఈ పాటకు సంగీతం అందించారు. గీత రచయిత శ్రీమణి అందమైన సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ మరియు హరి ప్రియ కలిసి శ్రావ్యంగా ఆలపించారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu