HomeTelugu Trending'జనగణమన'పై విజయ్‌ దేవరకొండ స్పందన

‘జనగణమన’పై విజయ్‌ దేవరకొండ స్పందన

Vijay devarakonda comments
రౌడీ హీరో విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మథ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. దీంతో పూరి, విజయ్‌తో తీయాలి అనుకున్న’జనగణమన’ సినిమాను పక్కనపెట్టేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ దేవరకొండ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది.

తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్ దేవరకొండను మీడియా ప్రతినిధులు ‘జనగణమన’ చిత్రం ఏమైందని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. సైమా వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని భావిస్తారని, కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోవాలని సమాధానమిచ్చారు. విజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సినిమా ఆగిపోయింది అనే చర్చ మొదలైంది. పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్టు ‘జనగణమన’. మార్చిలో విజయ్ దేవరకొండ, పూజా హెగ్ఢే జంటగా ఈ సినిమా షెడ్యూల్‌ను ప్రారంభించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu