HomeTelugu Trending'కోతికొమ్మచ్చి' థీమ్ సాంగ్ విడుదల

‘కోతికొమ్మచ్చి’ థీమ్ సాంగ్ విడుదల

Kothi Kommacchi Theme Song

జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ వేగేశ్న డైరెక్షన్‌లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘కోతికొమ్మచ్చి’. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. లక్ష ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఎంఎల్‌వి సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ విజయ కృష్ణ, మణి చందన, అన్నపూర్ణమ్మ, షిజు, మరియు శివనారాయణ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి భాను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కోతికొమ్మచ్చి’ థీమ్ సాంగ్ ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ఈ పాటను దివ్య ఐశ్వర్య, శ్రీ శ్రీత తుమ్ము మరియు ఎస్.జె.కైవిల్యలతో కలిసి అనుప్ రూబెన్స్ పాడారు. సాహిత్యాన్ని శ్రీ మణి రచించగా, అనుప్ రూబెన్స్ వినోదాత్మకంగా ట్యూన్ కంపోజ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu