HomeTelugu Trendingవిహారానికి వెళ్లి శవమై తేలిన హాలీవుడ్ నటి!

విహారానికి వెళ్లి శవమై తేలిన హాలీవుడ్ నటి!

Actress naya riveras body f
హాలీవుడ్ నటి నయా రివీరా క్యాలిఫోర్నియాలోని పెరూలేక్ లో పడి మృతి చెందింది. ఐదు రోజుల క్రితం నటి నయా రివీరా తన కుమారుడితో కలిసి బోట్‌ ను అద్దెకు తీసుకొని పెరూ లేక్ లో బోటింగ్‌ కు వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో, బోట్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పెరూలేక్ లో గాలించగా, బోట్ దొరికింది. అందులో పిల్లాడు ఒక్కడే పడుకుని ఉండడంతో విస్తుపోయారు. బోటులో లైఫ్ జాకెట్, రివీరా పర్సును గుర్తించారు.

నటి నయా రివీరా లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు, నదిని జల్లెడ పట్టారు. ఐదు రోజుల తరువాత రివీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రివీరా ఆత్మహత్య చేసుకుందా లేదంటే ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫాక్స్ మ్యూజికల్ సినిమా గ్లీ లో నటించిన ఈ నటి మంచి పేరు తెచ్చుకుంది. రివీరా మరణం పట్ల హాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu