HomeTelugu Trending'కృష్ణ వ్రింద విహారి' టీజర్‌

‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్‌

Krishna vrinda vihari movie

యాక్షన్ హీరోగా .. మరో వైపున ఫ్యామిలీ హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి తన వంతు ప్రయత్నం నాగశౌర్య. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాను పూర్తిచేశాడు. నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో షిర్లే సెటియా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఇది లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది .. రొమాన్స్ పాళ్లు ఎక్కువేననే విషయం స్పష్టమవుతోంది.

హీరోయిన్ ప్రేమ కోసం హీరోపడే ఆరాటం .. ఆమె అలకలు .. బుజ్జగింపులు .. ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ స్నేహితుల దగ్గర అసహనాన్ని ప్రదర్శించడం .. ‘పెళ్లి చేసుకుందాం’లో వెంకటేశ్ కంటే బాగా చూసుకుంటాను వంటి కామెడీ టచ్ తో ఈ టీజర్ నడిచింది. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రివ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu