HomeTelugu Big Storiesరాధేశ్యామ్‌: కృష్ణంరాజు లుక్‌ విడుదల

రాధేశ్యామ్‌: కృష్ణంరాజు లుక్‌ విడుదల

krishnam raju as a paramaha
టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌- పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. వరుసగా పాటలు విడుదల చేస్తూ హైప్‌ పెంచుతున్న సినిమా టీమ్‌ తాజాగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్‌ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.

‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ వర్క్‌ చేస్తుండటం విశేషం. అయితే సినిమాలో మాత్రం యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథే ఎక్కువ ఉంటుందట. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu