అనసూయ కేవలం ఐటెమ్ కోసం కాదట!

బుల్లితెరపై తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకొని వెండితెరపై కూడా తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది అనసూయ. ఈ క్రమంలో ఆమె చేసిన సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేశాయి. అయితే క్షణం సినిమాలో తప్ప ఆమెకు పెద్ద రోల్స్ లో నటించే ఛాన్స్ రాలేదు. రీసెంట్ గా ఆమెకు రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఐటెమ్ సాంగ్ కోసం ఎంపిక చేసుకున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి.

కానీ ఈ సినిమాలో ఆమెది ఐటెమ్ సాంగ్ చేయడం లేదట. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. సినిమా మొత్తం ఆమె రోల్ ఉంటుందట. ఈ సినిమాతో ఆమెకు క్రేజ్ మరింత పెరగడం ఖాయంని తెలుస్తోంది. ఎనభైలలో జరిగే ఈ ప్రేమ కథలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.