HomeTelugu Trendingరామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ

రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ

Ram with Krithi Shetty
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజా చిత్రం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాతో రామ్ తమిళ ప్రేక్షకులకు దగ్గరకాబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన మూవీ హీరోయిన్ కృతిశెట్టి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగింది. కృతిశెట్టి ప్రస్తుతం నాని సరసన శ్యామ్ సింగరాయ్‌లో నటిస్తోంది . కమర్షియల్ చిత్రాలకు పేరుగాంచిన లింగుస్వామి రామ్‌తో తొలిసారి ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ శక్తివంతమైన పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu