HomeTelugu Trendingకస్టడీ: కృతి శెట్టి ఫస్ట్‌లుక్‌ విడుదల

కస్టడీ: కృతి శెట్టి ఫస్ట్‌లుక్‌ విడుదల

krithi shetty looks from cu
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కృతి శెట్టి పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె ‘రేవతి’ పాత్రను పోషించిందనే విషయాన్ని రివీల్ చేశారు. రేవతి ఆందోళన .. ఆవేదనకి లోనైనట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. కృతి శెట్టి, నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu