HomeTelugu Trendingప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

KS sethumadhavan passed awa

ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. 90 ఏళ్ల ఈ దర్శకుడు చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 1961లో మలయాళంతో డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాను డైరెక్ట్ చేశారు సేతు మాధవన్‌.

కేరళలోని పాలక్కడ్‌లో 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్‌. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్‌, ఉమ, సంతోష్ సేతు మాధవన్‌ ఉన్నారు. 1991లో మరుపక్కమ్‌ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. కె. ఎస్ సేతుమాధవన్ 1962 మలయాళ చిత్రం ‘కన్నుమ్ కరాలుమ్‌’ లో కమల్ హాసన్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేశారు. దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమాలకు చేసిన కృషికి గానూ 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu