నెల జీతం విరాళంగా ఇచ్చిన కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి తన వంతుగా నెల జీతం రూ.2.50 లక్షలను విరాళంగా ఇస్తున్నానని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రకటించారు. సిరిసిల్లలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇవాళ ఆయన హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో పార్టీకి స్థలం కూడా లేని స్థితి నుంచి జూబ్లీహిల్స్‌లో భవనం కట్టుకోగలిగే స్థాయికి ఎదిగామన్నారు. 2001లో చిన్న మొక్కగా ప్రారంభమైన పార్టీ ఇవాళ అన్ని జడ్పీ స్థానాలనూ గెలిచే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నామన్నన కేటీఆర్‌.. ఇప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రూ.40 లక్షల విరాళాలు వచ్చాయని చెప్పారు.