HomeTelugu Trending'కేరాఫ్ కంచరపాలెం'కు కేటీఆర్‌ సాయం

‘కేరాఫ్ కంచరపాలెం’కు కేటీఆర్‌ సాయం

3 13గతేడాది విడుదలైన చిత్రాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను జాతీయ అవార్డుల రేసులో నిలిపేందుకు ఆ చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి దరఖాస్తు పెట్టారు. కానీ ఆమె ఎన్నారై కావడంతో దరఖాస్తును తిరస్కరించారు కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ సింగ్.

ప్రవీణ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెలిబుచ్చగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుణ్ జైట్లీ, రాజ్యవర్థన్ రాథోడ్ సింగ్ లను ట్యాగ్ చేస్తూ సినిమాకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో రాథోడ్ సింగ్ సినిమాను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలా కేటిఆర్ తన ట్వీట్ ద్వారా చిన్న సినిమాకు పెద్ద సాయమే చేశారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu