HomeTelugu Big StoriesKubera: ఆసక్తికరంగా ధనుష్‌- నాగార్జున్‌ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌

Kubera: ఆసక్తికరంగా ధనుష్‌- నాగార్జున్‌ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌

Kubera First Look

Kubera: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ మరియు గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు.

ఈ సందర్భంగా ధనుష్ ఫస్ట్ లుక్ తో ఓ గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియో మొదట గౌరీశంకరులను చూపిస్తూ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కెమెరా మెల్లగా వాళ్ల నుంచి దూరంగా జరుగుతుండగా.. ధనుష్ ఎంట్రీ ఇస్తాడు. పూర్తిగా వెరిసిపోయిన గడ్డంతో, ఓ సింపుల్ డ్రెస్ లో అతడు కనిపించాడు. చివర్లో ధనుష్ కెమెరా వైపు తిరిగి ఓ స్మైల్ ఇస్తాడు.

ఆ తర్వాత మూవీ టైటిల్ పడుతుంది. మొదట తమిళంలో ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో టైటిల్ రివీల్ చేశారు. ఈ గ్లింప్స్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కుబేర మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu