HomeTelugu Trendingదుల్కర్‌ సల్మాన్‌ 'కురుప్‌' ట్రైలర్‌

దుల్కర్‌ సల్మాన్‌ ‘కురుప్‌’ ట్రైలర్‌

Kurup movie trailer

‘మహానటి’ ఫేం దుల్కర్‌ సల్మాన్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కురుప్‌’. ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ని విడుదలచేసింది. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం అనిపిస్తుంది ట్రైలర్‌ని చూస్తుంటే కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించారు. తన నటనతో అందరికీ కట్టిపడేసేలా ఉన్నారు. క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కురుప్‌ వేసే ప్లాన్లతో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచింది.

శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శోభిత హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu