ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన విడుదలైన ‘మజిలీ’ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాను తీసిన విధానం కానివ్వండి, నాగచైతన్య, సమంత యాక్టింగ్ కానివ్వడండి సినిమాకు ప్లస్ అయ్యాయి. మిడిల్ క్లాస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా లైక్ చేస్తున్నారు.
సినిమాలో లేని కొన్ని సీన్స్ ను యూనిట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తోంది. ఈ సీన్స్ చూసిన తరువాత సినిమాలో ఎంత డెప్త్ ఉందొ తెలుసుకొని థియేటర్స్ కు వస్తారని యూనిట్ ఉద్దేశ్యం. నాగచైతన్య.. తన మామ పోసాని ఇంటికి వచ్చినపుడు వచ్చే సీన్ అది. ఆ సీన్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.