Homeతెలుగు Newsఈ సారి కేసీఆర్‌ జీరో కావడం ఖాయం: ఖుష్బూ

ఈ సారి కేసీఆర్‌ జీరో కావడం ఖాయం: ఖుష్బూ

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం కాదని కమీషన్ మ్యాన్‌ అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదని, తెలంగాణ అవినీతిలో రెండు, నిరుద్యోగంలో మూడో స్థానంలో ఉందని విమర్శించారు. మీకు నేను ఉన్నానని చెప్పేదే హస్తం అని, కాంగ్రెస్‌ హస్తం.. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పొదుపు సంఘాలకు ఉచితంగా రూ.లక్ష రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు ఇస్తామని, రేషన్‌ దుకాణాల ద్వారా 9రకాల సరకులు అందిస్తామని చెప్పారు. రైతులకు మద్దతు ధర అందించడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రూ.300 కోట్లతో ప్రగతిభవన్‌ కట్టుకున్న కేసీఆర్‌కు సొంత కారులేదట! అని ఖుష్బూ ఆశ్చర్యంవ్యక్తం చేశారు. సచివాలయానికి కూడా రాకుండా ఫాంహౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని దుయ్యబట్టారు.

7 15

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ జీరో కావడం ఖాయమన్నారు. తెలంగాణలో అధర్మ పాలన సాగుతోందని, మావోయిస్టుల పట్ల ప్రభుత్వం తీరు బాగాలేదన్నారు. నకిలీ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని ఖుష్బూ విమర్శించారు. శృతి ఎన్‌కౌంటర్‌పై సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో చెప్పింది.. కేసీఆర్‌ఒక్కటీ చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌, బీజీపీలు ప్రేమలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని, జర్నలిస్టులను కూడా మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. కాంగ్రెస్‌ 11 మంది మహిళలకు టికెట్లు ఇస్తే.. టీఆర్‌ఎస్‌ ముగ్గురికే ఇచ్చిందనిచెప్పారు. బతుకమ్మ చీరల కొనుగోళ్లలో రూ.220 కోట్లు దోచుకున్నారని మరోసారి ఆరోపించారు. మహిళలంటే కేసీఆర్‌ కుమార్తె ఒక్కరేనా? అని ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu