మెగా అల్లుడుకి బాలీవుడ్‌ హీరోయిన్‌?

మెగాస్టార్‌ చిన్నఅల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రెండవ సినిమా ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు పులి వాసు డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రెహ చక్రబర్తిని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమాతో మెప్పించిన రెహ ఆ తరవాత బాలీవుడ్ కు వెళ్లి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పులి వాసు చెప్పిన కథ నచ్చడంతో రెహా కూడ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.