HomeTelugu Big Stories'ఖుషి' ట్రైలర్‌ వచ్చేసింది

‘ఖుషి’ ట్రైలర్‌ వచ్చేసింది

KUSHI Official Trailer

విజ‌య్ దేవ‌ర‌కొండ – సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ‌నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది.

ఈ ట్రైలర్‌ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది. విజయ్‌- సమంత లవ్‌ చేసుకోవడం, పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవాడం. ఆ తరువాత వారి లైఫ్‌ ఎలా సాతుంది అనేది ట్రైలర్‌లో చూపించారు. ఫన్‌, రొమాంటిక్‌, సస్పెన్స్‌ ఈ ట్రైలర్‌ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన రాగా.. ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్‌లో రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu