ఆరు క్రేజీ ప్రాజెక్టులతో అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ లాక్‌డౌన్‌ సమయంలో భారీ ప్రణాళికలు చేసుకున్నాడు. వరుసగా ఆరు క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్దమవుతున్నాడు. బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ స్పెషల్‌ వీడియో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే బన్నీ ‘ఐకాన్’ సినిమా మీద దృష్టి పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. దీనికి ‘వకీల్‌ సాబ్‌’ఫేమ్‌ వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.

ఇది పూర్తైన వెంటనే బన్నీ పుష్ప-2గా రాబోతున్నాడు. ఈ మూడు చిత్రాలు విడుదలైన తర్వాత ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బన్నీ. అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ‘సరైనోడు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. ఇందులో బన్నీ న్యూలుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా అనంతరం బన్నీ 25వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ఫినిష్ చేస్తాడట.

ఈ చిత్రాలే కాకుండా.. ప్రశాంత్‌ నీల్‌, విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో కూడా బన్నీ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఈ ఆరు ప్రాజెక్టులకు ఆడ్వాన్స్‌ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాల‌న్నింటికీ కలిసి బన్నీ దాదాపు రూ.180 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుంటున్నాడట. పుష్ప-1 కోసం బన్నీ రూ.35 కోట్లు తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. ఇక రెండో భాగానికైతే రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. మొదట విడుదలయ్యే ఒకటి రెండు సినిమాలు హిట్‌ అయితే.. బన్నీ రెమ్యునరేషన్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates