నితిన్ అస్సలు తగ్గట్లేదు!

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నితిన్ ఇటీవల ‘అ ఆ’ సినిమాతో మరో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కథలను ఎన్నుకునే తీరే తన సక్సెస్ ను కారణం అని చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో ఈ హీరో హను రాఘవపూడితో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటి వరకు నితిన్ తన సినిమాకు 5 నుండి 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇకపై తన పారితోషికం పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన దగ్గరకు వస్తోన్న నిర్మాతలకు 10 కోట్లకు తగ్గేదే లేదని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

నిర్మాతలు కూడా ఆ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నితిన్ సక్సెస్ లో ఉన్నాడు. అతడిపై పెట్టుబడి పెట్టినా.. తిరిగి వచ్చేస్తుందని వారి అభిప్రాయం. ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ సీన్ రివర్స్ అయితే గనుక నిర్మాతకు నష్టం తప్పదు. కాబట్టి అన్నీ ఆలోచించి ముందడుగు వేస్తే మంచిది!