HomeTelugu Trendingమిస్‌ శెట్టి- మిస్టర్‌ పోలిశెట్టి: వీడియో సాంగ్‌ విడుదల

మిస్‌ శెట్టి- మిస్టర్‌ పోలిశెట్టి: వీడియో సాంగ్‌ విడుదల

Lady Luck Full Video Song f
స్టార్‌ హీరోయిన్‌ అనుష్క – యంగ్‌ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి’. చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన సినిమా కావడంతో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్‌ విడుదలైంది.

‘ఎందుకంత ఇష్టం నేనంటే .. ఇందులోని గొప్ప నేను నీకంటే .. ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే’ అంటూ ఈ పాట సాగుతోంది. రాధన్ స్వరపరిచిన ఈ బాణీకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. హుషారైన బీట్ .. అందుకు తగిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి.

అనుష్కను అభిమానిస్తూ .. ఆరాధిస్తూ .. ప్రేమిస్తూ, ఆమె రాకతో తన లైఫ్ మొత్తం మారిపోయిందని హీరో వ్యక్తం చేసే తన మనసులోని మాటనే ఈ పాట. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu