బాలయ్యతో పోటీ పడనున్న కౌశల్‌..?

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్ బాస్ సీజన్-2’ తో కౌశల్ టాప్ కంటెస్టెంట్ గా ఎదిగారు. ప్రస్తుతం కౌశల్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కౌశల్‌ పేరిట ఓ ఆర్మీ స్థాపించి అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-2లో తానే హీరోగా తానే విలన్‌గా అత్యధిక మార్కులు కొట్టేశాడు కౌశల్‌. ఇక బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వస్తే సినిమా రంగం నుంచి విపరీతమైన ఆఫర్స్ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కౌశల్ అంటే కుర్రకారులో విపరీతంగా క్రేజ్ ఉంది. దీంతో బిగ్ బాస్ 2′ పూర్తయిన తరువాత కౌశల్ కి వరుస సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మోడలింగ్ రంగంనుంచి వచ్చిన కౌశల్ గతంలో కొన్ని సీరియల్స్ లోను .. సినిమాల్లోను నటించాడు.

 

అయితే కౌశల్ కి సినిమా ఛాన్స్ లు ఇవ్వడానికి రెఢీ అవుతున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే బోయపాటి ఆ పనిలో ఉన్నారని తెలుస్తుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి చేయబోయే సినిమాలో విలన్ పాత్ర గానీ .. నెగెటివ్ షేడ్స్ కలిగిన మరో పాత్రగాని కౌశల్ కి లభించవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే బోయపాటి టీమ్ కౌశల్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే బుల్లితెరపై సంచలనం సృష్టించిన కౌశల్‌ వెండి తెరపై కూడా తన సత్తా చాటబోతున్నట్టే.