HomeTelugu Big Storiesలక్ష్మీ's NTR పునర్జన్మ దర్శనం

లక్ష్మీ’s NTR పునర్జన్మ దర్శనం

5a 1

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌” సినిమాకు సంబంధించి ముఖ్యమైన వీడియోను విడుదల‌ చేశారు. శుక్రవారం ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పునర్జన్మదర్శనం” పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్ (పాత్ర) కనిపించారు. కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ ఎన్టీఆర్‌ పాత్ర కనిపించింది. అయితే ఎన్టీఆర్‌ పాత్ర చేస్తున్న నటుడు ఎవరో తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నట్లు వర్మ తొలుతే చెప్పారు. ఇందులో నిజమైన కథను చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు పాత్ర లుక్‌ను కూడా వర్మ పంచుకున్నారు.

ఈ చిత్రాన్ని రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ఈ సినిమాలోని పాటలు తనను చాలా బాధించాయని ఇటీవల మీడియాతో లక్ష్మీ పార్వతి అన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాటలపై పలువురు రాజకీయ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu