ఇప్పుడు కఠిన పరిస్థితిలో ఉన్నాను: సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత మయోసైటిస్ అనే దీర్ఘకాల కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. తాను ఈ వ్యాధి బారిన పడ్డానని సమంత ప్రకటించినప్పటి నుంచి… సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధిని జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘యశోద’ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించారు.

ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సమంత చెప్పారు. తాను కూడా దీన్ని ఎదుర్కొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టుకున్నారు. త్వరలోనే దీన్నుంచి బయటపడతానని అన్నారు. ‘నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కొందరు వార్తలు రాశారు. అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలో లేను. ప్రస్తుతానికైతే నేను ఇంకా చావలేదు’ అన్నారు సమంత.

మన నియంత్రణలో ఏదీ ఉండదని… అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుందని అన్నారు. తాను ఇప్పుడు కఠిన పరిస్థితిలోనే ఉన్నానని చెప్పారు. అందరి జీవితాల్లో మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయని తెలిపారు. ఒక్కొక్క సారి ఒక్క అడుగు కూడా వేయలేనేమో అని అనిపిస్తుందని అన్నారు. అయితే, తాను పోరాటం చేస్తానని, గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది సమంత.

CLICK HERE!! For the aha Latest Updates