HomeTelugu Trendingలవకుశ లో 'లవుడు' నాగరాజు కన్నుమూత

లవకుశ లో ‘లవుడు’ నాగరాజు కన్నుమూత

Lava Kusa nagaraju passes

నట సార్వభౌమ ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’. సీత రాములను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ సినిమా ఇప్పటికీ చెక్కుచెదరిని ఒక అపురూప చిత్రం. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే హైలెట్‌గా నిలిచారు. వారి హావ భావాలు ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేశారు. ఈ సినిమాలో లవుడుగా తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడు పెరుగు నాగరాజు. ఈ సినిమా ద్వారా ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నాగరాజు మరణం పట్ల సినిమా పరిశ్రమకు చెందిన వారు, ‘లవకుశ’ అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu