తెలుగువాడైన విశాల్‌ని తరిమికొట్టాండి.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా.. నటుడు విశాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళ నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్ తరిమికొట్టాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.

నడిగర్ సంఘం‌ నుండి తమిలేతరుడైన విశాల్‌ని తొలగించాలని.. నిర్మాతల మండలిలో మొలిచిన ఇలాంటి కలుపు మొక్కను ఏరేయాల్సిన బాధ్యత తమిళ నిర్మాతలపై ఉందన్నారు. నడిగర్ సంఘంలో తెలుగు వాళ్ల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ.. ఇలాంటి పందికొక్కుల్ని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు.

నడిగర్ సంఘం తమిళ నిర్మాతలదైతే.. అందులో తెలుగువాళ్ల పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు భారతీరాజా. అందుకే ఈ ఎన్నికల్లో తన నేతృత్వంలోని టీంను గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడాలన్నారు. తాను గెలిస్తే… నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటుల సంఘం) పేరుని తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తామన్నారు భారతీ రాజా.