HomeTelugu Trendingవకీల్‌ సాబ్‌లో నాగ్‌ బ్యూటీ!

వకీల్‌ సాబ్‌లో నాగ్‌ బ్యూటీ!

7 15
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ‘వకీల్ సాబ్’ పేరుతో రూపొందుతోంది. ‘దిల్’ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో నివేద థామస్ .. అనన్య .. అంజలి నటిస్తున్నారు.

తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా ఇలియానాను .. శ్రుతి హాసన్ ను సంప్రదించారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ, లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారు. కాగా ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu