HomeTelugu Trendingలావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల

లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల

Happy Birthday Trailer

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం “హ్యాపీ బర్త్‌ డే”. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాకు మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకుడు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రం జులై 8న విడుదల రాబోతోంది. సరికొత్త పాత్రలు, విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తుపాకీల చూట్టు తిరుగుతుందని, పూర్తి వినోదభరితంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతాన్ని అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu