కలర్స్‌ స్వాతి రీఎంట్రీ!

కలర్స్‌ స్వాతి హీరోయిన్‌ గా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పూర్తిగా గాడిలో పడకముందే పెళ్లి చేసేసుకోవటంతో స్వాతి సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందని భావించారు. తరువాత ఒకటి రెండు ఇంటర్వ్యూలలో రీ ఎంట్రీ గురించి ప్రస్తావించినా సీరియస్‌గా అలాంటి ప్రయత్నాలు చేయకపోవటంతో ఇక కెరీర్‌ ముగినట్టే అని భావించారు.

అయితే తాజాగా కలర్స్‌ స్వాతి రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. స్వాతి కెరీర్‌లో మంచి విజయం సాధించిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతోనే స్వాతి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రీ ఎంట్రీలో అయిన స్వాతి స్టార్ ఇమేజ్‌ అందుకుంటుందేమో చూడాలి.