HomeTelugu Trending'లైగర్' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లైగర్’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Liger trailer update
టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘లైగర్’ సినిమా రూపొందింది. పూరి జగన్నాథ్‌, చార్మీ, కరణ్ జొహార్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో పూరి ఎక్కువ టైమ్‌ తీసుకున్నాడు. కరోనా ప్రభావం కారణంగా మరింత ఆలస్యమైంది. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాతో టాలీవుడ్‌లో అనన్య పాండే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడాని కి డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. మైక్ టైసన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, మకరంద్ దేశ్ పాండే .. రోనిత్ రాయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విజయం విజయ్ దేవరకొండకి కీలకం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu