HomeTelugu Trendingమహేష్‌ సినిమాలో ఉపేంద్ర!

మహేష్‌ సినిమాలో ఉపేంద్ర!

upendra in mahesh trivikram

కన్నడ హీరో ఉపేంద్ర టాలీవుడ్‌లో కేరక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసిన ఆయన, త్వరలో రానున్న ‘గని’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.

ప్రస్తుం మహేశ్ బాబు సినిమా కోసం ఉపేంద్రను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టుగా ఒక వార్త చకర్లు కొడుతంది. ఈ సినిమాలో ఒక కీలమైన పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉపేంద్ర పేరు తెరపైకి వచ్చింది. మోహన్ లాల్ కి బదులుగా ఉపేంద్రను తీసుకున్నారా? లేదంటే ఆయనతో పాటు ఉపేంద్ర కూడా ఉన్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.

ప్రస్తుతం మహేశ్ బాబు చేస్తున్న ‘సర్కారువారి పాట’ ముగింపు దశలో ఉంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను, మే 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్టు పైకి రానున్నాడు. ఇందులో కథానాయికగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu