HomeTelugu Trendingకోట బొమ్మాళి p.s: ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

కోట బొమ్మాళి p.s: ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

Lingi Lingi Lingidi Lyricalమలయాళ మూవీ ‘నాయట్టు’ హక్కులను రెండేళ్ల కిందటే అల్లు అరవింద్‌ కొనుగోలు చేశాడు. ముందుగా డబ్బింగ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్‌ చేద్దామనుకున్నాడు. కానీ కంటెంట్‌ వైజ్‌గా ఇదో అద్భుతమైన సినిమా అని భావించి, రీమేక్‌ ప్లాన్‌లో పడ్డాడు. పెద్ద స్టార్‌లతో గ్రాండియర్‌గా సినిమా తీయాలని ప్లాన్‌ చేశాడు. కానీ అది కుదరలేదు. దాంతో నటుడు శ్రీకాంత్‌ను ప్రధాన పాత్రలో పెట్టి తీశాడు. ఈసినిమాకి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ సినిమాకు కోట బొమ్మాళి P.S అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. రాహుల్ విజయ్‌, శివాని రాజశేఖర్‌ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనుంది. పేరుకు మలయాళ సినిమానే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు భారీ మార్పులు చేసినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ టైమ్‌ను మేకర్స్‌ ప్రకటించారు. లింగి లింగి లింగిడి అంటూ సాగే ఈ పాట మాస్‌ బీట్‌ సాంగ్‌ను శ్రీలీల లాంచ్‌ చేసింది. సంగీత దర్శకుడు మిథున్ ముకుందన్ ఈ పాటను ఫోక్‍ సాంగ్‍గా ఫాస్ట్ బీట్‍తో స్వరపరిచారు. రఘు కుంచె లిరిక్స్ అందించటంతో పాటు ఈ పాటను స్వయంగా పాడారు. కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకీ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu