HomeTelugu Newsపేపర్‌బాయ్ చాలా ఫ్రెష్‌గా ఉంది: మహేష్‌

పేపర్‌బాయ్ చాలా ఫ్రెష్‌గా ఉంది: మహేష్‌

సూపర్ స్టార్‌ మహేశ్‌బాబు పేపర్‌బాయ్ ట్రైలర్‌ తనకు చాలా నచ్చిందని అంటున్నారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన సినిమా పేపర్‌ బాయ్‌. ఈ చిత్రంలో రియా సుమన్‌, తాన్య హోప్‌లు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జయ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ ట్రైలర్ తనకూ ఎంతగానో నచ్చిందంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

2 25

పేపర్‌బాయ్ మూవీ ట్రైలర్‌ ను చూశాను. చాలా ఫ్రెష్‌గా, ప్రశాంతంగా అనిపించింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. సంతోష్‌ తండ్రి శోభన్‌తో కలిసి నేను పనిచేశాను. అందుకే ఈ ట్రైలర్‌ నాకు మరింత నచ్చింది. తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంతోష్‌కు, చిత్రబృందానికి బెస్ట్‌ విషెస్‌’ అని ట్వీట్‌ చేస్తూ ట్రైలర్‌ వీడియోను పంచుకున్నారు మహేశ్‌. మహేశ్‌ నటించిన ‘బాబీ’ చిత్రానికి శోభన్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 7వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu