HomeTelugu Trendingవచ్చే 3 నెలల్లో సందడి చేసే సినిమాలు ఇవే..

వచ్చే 3 నెలల్లో సందడి చేసే సినిమాలు ఇవే..

list of movies

థియేటర్లలో మళ్లీ సినిమా సందడి మొదలైంది. పుష్పతో ప్రారంభమైన ఈ మూవీ ఫెస్టివల్‌ మే 27న విడుదలైన F3 కొనసాగుతోంది. పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను థ్రిల్ ఇచ్చింది. మే రెండోవారంలో సర్కారు వారి పాట ఘనంగా విడుదల కాగా చివరి వారంలో ఎఫ్‌3 రిలీజైంది. ఈ సినిమాపై అందరూ మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.  పెద్ద సినిమా.. పైగా మ‌ల్టీస్టార‌ర్‌… దానికి తోడు హిట్ ఫ్రాంచైజీ కావటంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది…F3  థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మే నెలలో ఎఫ్3తో శుభం కార్డు పడటంతో..వచ్చే నెలలో సినిమాలకు ఆహ్వానం పలికేందుకు మరింత ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు. కేవలం వచ్చే జూన్ నెల మాత్రమే కాకుండా 3 నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో అలరించేందుకు రెడీ అయినా ఆ మూవీస్‌ ఏంటో చూద్దామా !
జూన్‌:
విక్రమ్‌- జూన్‌ 3
మేజర్‌- జూన్‌ 3
అంటే.. సుందరానికి- జూన్‌ 10
రామారావు ఆన్‌ డ్యూటీ-జూన్‌ 17 (ప్రస్తుతానికి వాయిదా పడింది)
గాడ్సే- జూన్‌ 17
సమ్మతమే- జూన్‌ 24

జూలై:
పక్కా కమర్షియల్‌- జూలై 1
విరాటపర్వం- జూలై 1
రంగ రంగ వైభవంగా- జూలై 1
థ్యాంక్‌ యూ- జూలై 8
ది వారియర్‌- జూలై 14
కార్తికేయ 2- జూలై 22
విక్రాంత్‌ రోణ- జూలై 28
హిట్‌ 2- జూలై 29

ఆగస్టు:
బింబిసార- ఆగస్టు 5
యశోద- ఆగస్టు 12
ఏజెంట్‌- ఆగస్టు 12
మాచర్ల నియోజకవర్గం- ఆగస్టు 12
లైగర్‌- ఆగస్టు 25

Recent Articles English

Gallery

Recent Articles Telugu