నాగశౌర్యను పరామర్శించిన ప్రముఖ దర్శకులు

యంగ్‌ హీరో నాగశౌర్యను ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగింది. చికిత్స చేసిన వైద్యులు 25 రోజులపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి హీరోను ఆయన నివాసంలో కలిశారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘నర్తనశాల’ తర్వాత నాగశౌర్య నటించిన ‘ఓ బేబీ’ మూవీ జులై 5న విడుదల కాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్‌ రోల్‌ను పోషించారు. లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి తెలుగు రీమేక్‌ ఇది.