HomeTelugu Trendingనాగచైతన్య 'లవ్‌ స్టోరీ' వచ్చేది అప్పుడేనట!

నాగచైతన్య ‘లవ్‌ స్టోరీ’ వచ్చేది అప్పుడేనట!

Love story will be Releas

అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసివుంది. అయితే మిగతా సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా వాయిదా వేసుకుంది. ఏప్రిల్ నుంచి మే నెలకి వాయిదా పడిన ఈ సినిమా, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అలా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. లవ్ స్టోరీ మూవీ మరో కొత్త డేట్ కు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లవ్ స్టోరీ మూవీ ఈ ఏడాది ఆగష్టులో రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఇప్పటికే సినిమా అన్నివిధాలా సిద్ధం అయిపోయింది. ఆగస్టు వరకు పరిస్థితి మాములుగా మారి థియేటర్స్ ఓపెన్ అయితే వెంటనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

కాగా ఇప్పటికే ఈసినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్ట్ ఉన్నాయి. నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా క్రియేట్ చేసినంత బజ్ ఏ సినిమా చేయలేదు. ఇప్పటికి ఇండస్ట్రీ దృష్టి ‘లవ్ స్టోరీ’ పైనే ఉంది. నాగచైతన్య తో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరోయిన్ సాయిపల్లవి సినిమాకు ఆ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యేందుకు కారణం అయ్యారు. ఇప్పటికే సినిమాలోని పాటలు అన్నికూడా సినిమా పై భారీ అంచనాలు క్రీయేట్‌ చేశాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu