HomeTelugu Trendingసాహో 'డైరెక్టర్‌'కు మెగా షాక్‌‌!

సాహో ‘డైరెక్టర్‌’కు మెగా షాక్‌‌!

Chiranjeevi changed lucife

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరు మలయాళం లో సూపర్ హిటైన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆసినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను కొణిదెల ప్రొడక్షన్స్ నుండి రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకు సాహో డైరెక్టర్‌ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా కథను మన తెలుగు నేటివిటీకి తగట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసే పని సుజీత్ కు అప్పగించాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త పిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి సుజీత్ కు హ్యాండ్ ఇవ్వనున్నట్లు ఈవార్తల సారశం. ఎందుకంటే.. ఇన్ని రోజులు కష్టపడి సుజీత్ చేసిన మార్పులు చిరుకు నచ్చలేదట! దానితో ఆ బాద్యతను మంచి అనుభవం ఉన్న దర్శకుడికి అపగించాలి అనుకుంటున్నారట. వి వి వినాయక్‌తో చేయాలనీ నిర్ణయించుకున్నారట. అయితే ఇంతకముంది వీరిద్దరి కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu