HomeTelugu Trending'మా వింత గాధ వినుమా' టీజర్‌

‘మా వింత గాధ వినుమా’ టీజర్‌

Maa Vinthae Gaadha Vinuma
సిద్ధు జొన్నలగడ్డ – శీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్ ఎంటర్టైనర్ ‘మా వింత గాధ వినుమా’. దీపావళి కానుకగా ‘ఆహా’ లో నవంబర్ 13న విడుదల కానుంది. ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్ మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘మా వింత గాధ వినుమా’ టీజర్ ని నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆదిత్య మండల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ – ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్ – మెలోడ్రామా స్టూడియోస్ పతాకాలపై సంజయ్ రెడ్డి – అనిల్ పల్లాల- జి. సునీత- కీర్తి చిలుకూరి నిర్మించారు.

”మా వింత గాధ వినుమా” చిత్రానికి హీరో సిద్ధు జొన్నలగడ్డ రచనా సహకారం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ప్రగతి, మంచు లక్ష్మి, శిశిర్ శర్మ, జయప్రకాశ్, రాజేశ్వరి నాయర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu