HomeTelugu Trendingమ్యాడ్ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్ ఎంతంటే?

మ్యాడ్ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్ ఎంతంటే?

Mad Movie first day collect

యూత్‌ఫుల్ కామెడీతో వచ్చిన మరో క్రేజీ మూవీ ‘మ్యాడ్’. ఇటువంటి సినిమాలకు తెలుగు ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. తాజాగా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ చిత్రం ఆరంభంలోనే హైప్ క్రియేట్ చేసుకుంది. ఎంతో గ్రాండ్‌గా రిలీజైన మ్యాడ్ మూవీకి మొదటి రోజే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా రూపొందిన క్రేజీ మూవీ ‘మ్యాడ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించాడు.

ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మ్యాడ్’ మూవీకి ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ.2.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

‘మ్యాడ్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 70 లక్షలు వరకూ షేర్‌ వసూలు చేసింది. అలాగే, రూ.1.35 కోట్ల వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టింది. దీంతో చిన్న సినిమా పెను సంచలనం సృష్టించినట్లైంది. ప్రపంచ వ్యాప్తంగా ‘మ్యాడ్’ రూ. 95 లక్షలు షేర్‌తో పాటు రూ.1.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

‘మ్యాడ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 2.20 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మొదటి రోజే దాదాపు సగం అంటే రూ. 95 లక్షలు రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 1.25 కోట్లు షేర్ రాబట్టాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu