మదర్ థెరెసా బయోపిక్

ఎక్కడ ఎలా పుట్టాం.. ఎలా పెరిగాం అన్నది కాదు…. ఎంత గొప్పగా బ్రతికాం అనేదే ముఖ్యం. పదిమందికి సహాయం చేయాలనే సంకల్పంతో ఉండే వ్యక్తులు జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా ఎదుగుతారు. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, ఇండియా వచ్చి.. కోల్కతా ప్రాంతంలో అనాధ శరణాలయాన్ని స్థాపించింది. ఆ శరణాలయం ద్వారా లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారింది.

ఆమె జీవితం నుంచి తెలుసుకోవలసినది.. నేర్చుకోవలసినది చాలా ఉంది. మదర్ థెరిసా గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇలా వచ్చిన పుస్తకాల్లో సీమా ఉపాధ్యాయ్ రచించిన మదర్ థెరెసా.. ది సెయింట్ అనే పుస్తకం బాగా పాపులర్ అయింది. ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు మదర్ థెరెసా బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు. సీమా ఉపాధ్యాయ్ నే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. 2020 లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.