HomeTelugu Newsబాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హీరో

బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హీరో

Madhavan as villain in shai

తమిళ స్టార్‌ హీరో మాధవన్‌కి లవర్‌ బాయ్‌గా ఇమేజ్‌ ఉండేది. ‘సఖి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాధవన్‌ మొదట్లో సాప్ట్‌ పాత్రలే చేశాడు. తర్వాత రకరకాల పాత్రలు చేసి మెప్పించాడు. తెలుగులో అతను నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

అందులో మాధవన్ పెర్ఫామెన్స్ బాగున్నప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా బాలీవుడ్లో విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు మాధవన్‌. ‘సైతాన్’ అనే పెద్ద సినిమాలో అతను నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. క్వీన్, సూపర్ 30 లాంటి చిత్రాలు రూపొందించిన వికాస్ బల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఆయనే స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు కూడా. కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, సూర్య భార్య జ్యోతిక హీరోయిన్ నటిస్తుంది. ఆమె చాలా ఏళ్ల ఈ సినిమాతో ఆమె బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తుంది.

పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న జ్యోతిక సెంకడ్‌ ఇన్నింగ్స్‌ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. గతంలో జ్యోతిక పక్కన హీరోగా నటించిన మాధవన్.. ఇప్పుడు ‘సైతాన్’లో విలన్‌గా నటిస్తున్నాడు. మాధవన్ బాలీవుడ్లో చాలా సినిమాలే చేశాడు. కొంచెం గ్యాప్ తర్వాత బాలీవుడ్లోకి అతను రీఎంట్రీ ఇస్తున్నాడు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu