‘దేవదాస్’లో రష్మిక పాత్ర ఇదే..!

హిట్‌ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్‌కి పరిచయమైన రష్మిక మందన్నా. ‘గీత గోవిందం’ సినిమాద్వారా రెండో భారీ హిట్ ను అందుకుంది. గీత గోవిందం తరువాత ఈ కర్ణాటక బ్యూటీకి వరసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం రష్మిక ‘దేవదాస్’ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక నాని పక్కన హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ సినిమా సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. సాంగ్స్ హిట్ కావడంతో.. సినిమా గ్యారెంటీ హిట్ అంటున్నారు.

ఈ సినిమాలో రష్మిక పాత్రకు సంబంధించిన ఫోటోను మూవీ యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. రష్మిక ఇందులో పూజ అనే పాత్రలో నటిస్తున్నది. మూడో సినిమా దేవదాస్ కూడా హిట్టైతే రష్మిక లక్ పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతంఅందిస్తున్నారు