HomeTelugu Trendingమాధురి దీక్షిత్‌కు మతృవియోగం

మాధురి దీక్షిత్‌కు మతృవియోగం

madhuri dixits mother sneha

ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ (91) కన్నుమూశారు. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు’ అని పేర్కొన్నారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే స్నేహలత మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు.

కాగా, గతేడాది తన తల్లి 90వ పుట్టిన రోజు సందర్భంగా మాధురి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు తల్లికి మించిని ఆప్తమిత్రులు లేరని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu