HomeTelugu Trending‘మహా సముద్రం’ మూవీ ట్రైలర్‌

‘మహా సముద్రం’ మూవీ ట్రైలర్‌

Mahasamudram trailerశర్వానంద్‌- సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకి సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. లవ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒకే ఫ్రేమ్‌లో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కనిపించి సందడి చేశారు. ఇద్దరూ పోటీపడి నటించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. జగపతి బాబు, రావు రమేశ్‌ ప్రతినాయక పాత్రల్లో మెప్పించారు. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu