HomeTelugu Big Stories1010 మంది చిన్నారుల గుండె చప్పుడు మహేష్‌

1010 మంది చిన్నారుల గుండె చప్పుడు మహేష్‌

Mahesh Babu helped Heart Suటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. విద్య, వైద్య సౌకర్యాల కోసం అంతే కాకుండా విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి వెయ్యిమందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా చేయించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా, చికిత్సలు చేయించి ప్రాణదానం చేస్తున్నాడు. ఇటీవల ఓ నెటిజన్ ఓ చిన్నారికి ఆపరేషన్ చేయించాలని సోషల్‌ మీడియాలో విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి చిన్నారికి ఇవాళ ఆంధ్రా హాస్పిటల్‌లో గుండె ఆపరేషన్ చేయించి ప్రాణదానం చేశాడు. ఇప్పటి వరకు 1010 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు చేయించి నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu