HomeTelugu Big Storiesమహేష్‌ బాబు 'సూర్యుడివో చంద్రుడివో' విడుదల

మహేష్‌ బాబు ‘సూర్యుడివో చంద్రుడివో’ విడుదల

5 8
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలోరష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం మహేష్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సోమవారం ‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగే లిరికల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహేష్‌‌-విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు, సెట్స్‌లో సందడి అభిమానులను విశేషంగా అలరిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలకు రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. బి.పరాక్‌ ఆలపించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ప్రకాష్‌రాజ్‌, సత్యదేవ్‌, నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu