HomeTelugu Trending'మేజర్‌' ట్రైలర్‌ ని విడుదల చేసిన మహేష్‌ బాబు

‘మేజర్‌’ ట్రైలర్‌ ని విడుదల చేసిన మహేష్‌ బాబు

Mahesh babu launched major
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్‌ పాత్రను యంగ్‌ హీరో అడివి శేష్‌ పోషించాడు. శశికిరణ్‌ తిక్క డైరెక్షన్‌లో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్‌ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 9) విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్‌. తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు విడుదల చేయగా, హిందీలో సల్మాన్‌ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్‌లో మేజర్‌ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు. ‘ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను’, ‘ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది’ వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu